
నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు
తిరువళ్లూరు: నిబంధనలను అతిక్రమించి రైలులో ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే భద్రత ఇన్‌స్పెర్ చిత్రదేవి హెచ్చరించారు. రైలులో సురక్షిత ప్రయాణంపై ప్రయాణికులకు అవగాహన కల్పించే కార్యక్రమం తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైల్వే ఇన్‌స్పెక్టర్ చిత్రదేవి మాట్లాడుతూ రైలు ప్రయాణం సురక్షితంగా సాగడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరమని, కొందరు నిబంధనలు అతిక్రమించి ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రయాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, తినుబండారాలను ఇస్తే వాటిని నిరాకరించాలని కోరారు. రైలులో పేలుడు పదార్థాలు, గంజాయి, గుట్కా తదితర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతోపాటు రాత్రి సమయంలో మహిళ ప్రయాణికులు కిటికీల వద్ద కూర్చుని ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం, కిటికీలను మూసివేయడం, రైల్వేహెల్ప్‌లైన్ 139 నంబర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే భద్రత అధికారులు, పోలీసులు, ప్రయాణికులు పాల్గొన్నారు.