
కోల్డ్ కాల్ టైటిల్, టీజర్ విడుదల
తమిళసినిమా: మిస్టర్స్ వాక్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేశవమూర్తి నిర్మిస్తున్న చిత్రం కోల్డ్ కాల్. ఈ చిత్రం ద్వారా తంబీదురై దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్ధు మూడిమనణి,సంతోష్ ఎస్‌ఏ ,శ్రీ వైష్ణవ్, కృష్ణ విజయచంద్రన్, బాలాజీ రాజశేఖర్ ,శ్రీకాంత్ వి, అనిత రంగనాథ, నిషా హెగ్డే, కీర్తన పుల్కి తదితరులు ప్రధాని పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం శరవణన్ జీఎన్ ఛాయాగ్రహణం, ప్రణవ్ గిరిధరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్, టీజర్ లను ఆదివారం విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఆసక్తికరమైన ప్రత్యేక పరిస్థితులతో కూడిన కొత్త ప్రయత్నం ఈ చిత్రమని పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశాలతో కూడిన వినోద భరిత కథాచిత్రంగా కోల్డ్ కాల్ ఉంటుందని చెప్పారు. చిత్ర టైటిలే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పారు. ఇది విక్రయాలకు సంబంధించిన కథ చిత్రం కాకపోయినా ఇందులో వ్యాపారపరమైన కార్యాలయం కార్యక్రమాలు వ్యాపారానికి అతీతంగా చేసే విషయాల గురించి చర్చించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇందులో వినోదాన్ని సరదా సందర్భాల్లోనూ, గొడవలతోనూ, ప్రతికూల ఘటనల్లోనూ, భావద్రేకాలతోనూ, వివిధ కెమెరా కోణాలతోను పండించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అయితే చిత్రం పూలిష్ గానూ, స్టాప్స్టిక్ కామెడీగానూ ఉండదన్నారు. ప్రతి సన్నివేశం సహజత్వంతో కూడి ఉంటుందన్నారు. కథాపాత్రలు తీయని అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. ఇది సస్పెన్స్‌తో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రం పది కాలాల పాటు ప్రేక్షకులకు గుర్తుండి పోతుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు.
కోల్డ్ కాల్ చిత్రంలో అమిత రంగనాథ, సిద్ధు, మూలిమణి తదితరులు