– స్థానికుల నిరసన
తిరువళ్లూరు: నివాస ప్రాంతాల్లో కాలం చెల్లిన మాత్రలు, కూల్‌డ్రింక్స్ డంప్ చేయడానికి వచ్చిన లారీనీ అడ్డుకుని స్థానికులు ఆందోళన నిర్వహించారు. వివరాలు..తిరువళ్లూరు జిల్లా కాకలూరు ప్రాంతంలో సుమారు 10 వేల మంది నివాసం వుంటున్నారు. ఇక్కడ కాకలూరు సిప్‌కాట్, ఆవీన్‌పాల కేంధ్రాలు వున్నాయి. ఈ కేంద్రాలకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తరచూ కాలం చెల్లిన మాత్రలు, సిరంజిన్, కూల్‌డ్రింక్స్‌ను డంప్ చేస్తున్నారు. ఈ డంపింగ్ వల్ల స్థానికంగా వున్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూవున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాలం చెల్లిన మాత్రలు, సుమారు పది టన్నులు విలువ చేసే రెండు లారీల్లో కూల్‌డ్రింక్స్‌ను లారీలో తీసుకుని రావడాన్ని గుర్తించిన స్థానికులు వాటిని అడ్డుకుని నిరసనకు దిగారు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, తాహసీల్దార్ బాలాజీ, డిప్యూటీ తాహసీల్దార్ దినేష్ తదితరులు మాత్రలు, కూల్‌డ్రింక్స్‌ను డంప్ చేయవద్దని ఆదేశించి లారీలను వెనుక్కి తిప్పి పంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.