
ఆ నటికి
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా.. బేబీ గర్ల్
సూపర్ హీరో ఇమేజ్
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలకు పుట్టిల్లు బాలీవుడ్ అనే పేరు ఉంది. మలయాళం చిత్రాలు తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ కావడమో, లేదా అనువాదంగానో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతుండటం చూస్తున్నాం. అలా ప్రస్తుతం మాలీవుడ్‌ల ప్రముఖ కథానాయకులుగా రాణిస్తున్న నటులలో నివిన్ పాలి ఒకరు. ఈయన నటించిన చిత్రాలు కచ్చితంగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని పొందుతుంటాయి. కాగా తాజాగా నివిన్ పాలి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం బేబీ గర్ల్. ఇన్వెస్టిగేషన్ ఇతివృత్తంగా రూపొందుతున్న థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం బేబీ గర్ల్. గరుడన్ చిత్రం ఫేమ్ అరుణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనాలను నమ్మక రచయితలు బాబి, సంజయ్ ద్వయం అందించడం విశేషం. మ్యాజిక్ ఫ్యాన్స్ పతాకంపై లిస్టింగ్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రంలో నటి లిజోమోల్ జోష్, సంగీత ప్రతాప్ నటిస్తున్నారు. నటుడు అభిమన్యు తిలకం అసిస్ నెడుమంగాడు, అశ్వంత్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర బందం తెలిపారు. ఇందులో నటుడు నివిన్ పాలి పాత్ర పవర్ ఫుల్ గానూ, వైవిధ్యంగొనూ ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. దీంతో బేబీ గర్ల్ చిత్రం ఎలా ఉంటుందని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటుంది.