
టాస్మాక్ గోదాము ముట్టడి
తిరువళ్లూరు: మద్యం సేవించిన తరువాత ఖాళీ బాటిల్స్‌ను టాస్మాక్ దుకాణంలో అప్పగించి పది రూపాయలను పొందవచ్చన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాస్మాక్ ఉద్యోగులు శనివారం ఉదయం గోదామును ముట్టడించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బాటిల్స్‌ను వెనుక్కి తీసుకునే విధానం కోసం నూతనంగా భవనం, ఉద్యోగులు నియమించి అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా తమకు పని ఒత్తిడి పెరగడంతో పాటూ అదనపు భారంగా మారిందని వాపోారు. తమ సమస్యలను పరిస్కరించని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరాహరదీక్ష చేపడుతామని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న టాస్మాక్ ఎస్‌ఆర్‌ఎం పన్నీర్‌సెల్వం,తాహశీల్దార్(టాస్మాక్) సెంథిల్‌కుమార్ తదితరులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. కోర్టు ఆదేశం కావడంతో తాము జోక్యం చేసుకోబోమని ఉద్యోగులు, కార్మికులకు ఉన్నత అధికారులు తేల్చిచెప్పారు. ప్రతి దుకాణంలోనూ బాటిల్స్ వెనుక్కి తీసుకునే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీంతో ఉద్యోగులు చేసేదేమీ లేక ఆందోళననూ విరమించి వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్‌లను పరిష్కరించని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. కాగా టాస్మాక్ ఉద్యోగుల ఆందోళనతో గోదాము వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

టాస్మాక్ గోదాము ముట్టడి