
అక్టోబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ‘ది గేమ్’
తమిళసినిమా: నటి శ్రద్ధ శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ది గేమ్. యు నెవర్ ప్లే అలోన్. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్, అప్లాస్ ఎంటర్‌టైనర్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సంస్థలు ఇంతకుముందు బ్లాక్ వారెంట్ అనే వెబ్ సిరీస్ నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాయి అన్నది గమనార్హం. కాగా ది గేమ్ వెబ్ సిరీస్‌లో నటి చాందిని, శ్యామ హరిణి ,బాలాహాసన్, సుభాష్ సెల్వం, వివియ చంద్ ధీరజ్, హేమ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ గురించి దర్శకుడు రాజేష్ ఎం సెల్వా తెలుపుతూ ఇది థ్రిల్లర్ కథ మాత్రమే కాదని మనం జీవిస్తున్న ప్రపంచంలో ప్రతిబింబించే జీవన విధానంలో రహస్యాలు, మారుతున్న నమ్మకాలు వంటివి చోటుచేసుకుంటాయన్నారు. అదేవిధంగా ప్రజలు ఎంచుకునే మార్గాలు, బాధింపు, నిజానికి మోసాలకు మధ్య బలహీనమైన గీత వంటి పలు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయన్నారు. ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించడానికి నెట్‌ఫ్లిక్స్, అప్లాస్ ఎంటర్‌టైనర్ సంస్థలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. నటీనటులు సాంకేతిక వర్గం పూర్తి సహకారాన్ని అందించారన్నారు. కాగా అక్టోబర్ రెండవ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటిటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకులు అందించే ఆదరణ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.