
బైకును ఢీకొన్న మినీ వ్యాన్
వేలూరు: బైక్‌ను, మినీవ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన తిరువణ్ణమలై జిల్లాలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని కేలూరు గ్రామానికి చెందిన మణికంఠన్(35) ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య మంజుల.ఈమె చెల్లెలు అముద(23). వీరి ముగ్గురూ కలిసి బైకులో ఆరణికి వెళ్లి కన్నమంగళం గ్రామానికి బైకులో వెళుతున్నారు. అదేసమయంలో వేలూరు నుంచి ఆరణి వైపు జామపండ్ల లోడుతో మినీవ్యాన్ వెళుతోంది. కొంగారంపట్టు గ్రామం వద్ద ఉన్న స్పీడ్ బ్రైకర్‌ను దాటుతుండగా అదుపుతప్పిన వ్యాన్ ఎదురుగా వస్తున్న మణికంఠన్ బైకును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మణికంఠన్, అముద అక్కడికక్కడే మృతిచెందారు. మంజులకు తీవ్రగాయాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ ముగ్గురిని స్థానికులు వెంటనే వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలసి కన్నమంగళం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో కన్నమంగళం రోడ్డులో ట్రాఫిక్ స్థంభించింది.

బైకును ఢీకొన్న మినీ వ్యాన్

బైకును ఢీకొన్న మినీ వ్యాన్