
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కుమారసంభవం
తమిళసినిమా: ఇంతకు ముందు యాత్తిసై వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన వీనస్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సంస్థ అధినేత కేజీ.గణేశ్ నిర్మించిన తాజా చిత్రం కుమార సంభవం. నటుడు, దర్శకుడు బాలాజీ వేణుగోపాలన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ద్వారా పాండియన్ స్టోర్స్ సీరియల్ ఫేమ్ కుమరన్ తంగరాజన్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. పాయల్ రాధాకృష్ణ నాయకిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జీఎం.కుమార్, కుమరవేల్, బాలా సరవణన్, వినోద్ సాగర్, లివింగ్‌స్టన్, శివ అరవింద్, వినోద్ మున్నా,ఽ దారణి, కవిత తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అచ్చుమణి సంగీతాన్ని, జగదీష్ సుందరమూర్తి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వయించిన ఆడియో ఆవిష్కరణ సమావేశంలో నటి పాయల్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సాధారణ హీరోయిన్ పాత్ర కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞలు అన్నారు. ఇది తన ఎంట్రీకి కరెక్ట్ చిత్రం అని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు కుమరన్ తంగరాజన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో వచ్చే డైలాగ్ తరహాలో ఈ చిత్రం తనకు లక్ష్యం అని పేర్కొన్నారు. దాదాపు 17 ఏళ్లుగా హీరోగా నటించాలని కలలు కన్నాననీ, అది ఇప్పుడు నెరవేర్చిన నిర్మాత గణేశ్‌కు ధన్యవాదాలు అన్నారు.దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా అంగీకారం పొంది నేటికి రెండేళ్లు పూర్తి అయ్యిందన్నారు. దర్శకుడిగా తన తొలి చిత్రం లక్కీమెన్ 2023 సెప్టెంబర్ 1న విడుదలయ్యిందన్నారు. ఈ చిత్రం అదే నెలలో విడుదల కానుండడం యాదృచ్చికమేనన్నారు. ఈ చిత్రం గురించి పలు ప్రశ్నలు తలెత్తవచ్చుననీ, ఇది కుమార్ అనే యువకుడి సాగే కథా చిత్రం కాడడంతో దీనికి కుమార సంభవం అని టైటిల్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ఇది ఫీల్‌గుడ్ ఫ్యామిలి ఎంటర్‌టెయినర్ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలోని ఆరు పాటలను తానే రాసినట్లు దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ చెప్పారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కుమారసంభవం