
నటుడు విమల్ హీరోగా వడమ్
తమిళసినిమా: కోలీవుడ్లో సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న విమల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వడమ్. మాసాని పిక్చర్స్ పతాకంపై ఆర్. రాజశేఖర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. దీనికి వి .కేందిలన్ కథ దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం మంగళవారం ఉదయం కోయంబత్తూర్‌లోని మాసాని అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అక్కడ ముందుగా 1,500 మందికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఇందులో విమల్‌కు జంటగా సంగీత నటిస్తుండగా నరేన్, రామదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని, ప్రసన్న ఎస్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మంజు విరట్టు అనే క్రీడా నేపథ్యంలో సాగే కథ చిత్రం అని చెప్పారు. తమిళ సంస్కృతి, సాంప్రదాయ పారంపర్యంలో ముఖ్యమైన వీరు క్రీడల్లో మంజు విరట్టు ఒకటి అన్నారు. జల్లికట్టు తేడా నేపథ్యంలో పరిచయాలు వచ్చాయని అయితే తొలిసారిగా మంజు విరట్టు క్రీడా నేపథ్యంలో రూపొందిస్తున్న తొలి చిత్రం ఇది అని చెప్పారు. ప్రేమ స్నేహం కుటుంబ అనుబంధాలతో పాటూ కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను మధురై, పొల్లాచ్చి,కారైక్కుడి పరిసర ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.