పరువు హత్యల నిరోధక చట్టానికి పట్టు! | - | Sakshi
Sakshi News home page

పరువు హత్యల నిరోధక చట్టానికి పట్టు!

Aug 6 2025 7:51 AM | Updated on Aug 6 2025 7:51 AM

పరువు హత్యల నిరోధక చట్టానికి పట్టు!

పరువు హత్యల నిరోధక చట్టానికి పట్టు!

● తిరుమా పోరుబాట ● 8 వారాలలో కవిన్‌ కేసు నివేదికకు కోర్టు ఆదేశాలు

సాక్షి, చైన్నె: పరువు హత్యల నిరోధానికి చట్టం తీసుకు రావాలన్న నినాదాన్ని వీసీకే అందుకుంది. డీఎంకే కూటమిలోని ఈ పార్టీ ఈనెల 9,11 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు ఆ పార్టీ నేత తిరుమావళవన్‌ పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా తిరునల్వేలిలో పరువు హత్యకు గురైన కవిన్‌ కేసులో 8 వారాలలో నివేదిక సమర్పించాలని మధురై ధర్మాసనం ఆదేశించింది. వివరాలు.. రాష్ట్రంలో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పెద్దల పరువుకు, కుల చిచ్చుకు ఇప్పటి వరకు వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని వెలుగులోకి రాగా, మరికొన్ని చాప కింద నీరులా అణగదొక్కారు. ఈ పరువు హత్యలను మద్రాసు హైకోర్టు గతంలో తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టుగా భరోసా ఇచ్చింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చే రీతిలో పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇందుకు గానూ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని హైకోర్టు జారీ చేసింది. అయినా, కులం, మతం అంటూ సాగే పెద్దల దాష్టీకానికి అనేక మంది పరువు హత్యలకు గురి అవుతూనే ఉన్నారు.

ఐటీ ఉద్యోగి పరువు హత్యతో..

గత నెల తిరునల్వేలిలో కవిన్‌ అనే ఐటీఉద్యోగి పరువు హత్యకు గురి కావడం కలకం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యేక చోట్ట కోసం ఒత్తిడి తెచ్చేందుకు డీఎంకే కూటమిలోని వీసీకే సన్నద్ధమైంది. మంగళవారం ఆ పార్టీ నేత, ఎంపీ తిరుమావళవన్‌ మీడియాతో మాట్లాడారు. పరువు హత్యలను కట్టడి చేయాలంటే ప్రత్యేక చట్టం ద్వారానే సాధ్యం అని స్పష్టం చేశారు. దేశంలో సాగుతున్న పరువు హత్యలన్నీ కట్టడి కావాలంటే తమిళనాడు ప్రభుత్వం ఆదర్శకం కావాలని సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఆదర్శకంగా నిలిచే విధంగా పరువు హత్యల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సీఎంస్టాలిన్‌ సన్నద్దం కావాలని కోరారు. ఈ చట్టం కోసం పట్టుబడుతూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వీసీకే నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని ప్రకటించారు. చైన్నెలో జరిగే నిరసనలో తాను పాల్గొననున్నట్టు వివరించారు. ఇదిలా ఉండగా కవిన్‌ హత్య కేసుపై మధురై ధర్మాసనం దృష్టి పెట్టింది. సీబీసీఐడీ విచారణ సరైనమార్గంలో సాగుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులకు నిరాకరించింది. 8 వారాలలో ఈ కేసుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సీబీసీఐడీని న్యాయమూర్తులు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement