
● సీఎం స్టాలిన్ శంకుస్థాపన ● కిలాంబాక్కంలో పోలీస్ స్ట
బాధితుడికి మోటారు సైకిల్ పంపిణీ
సాక్షి, చైన్నె: చైన్నెకు దక్షిణ దిక్కునకలైంజ్ఞర్ శత జయంతి స్మారక సబర్బన్ బస్ టెర్మినల్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక్కడి భద్రత నిమిత్తం చైన్నె మహానగర అభివృద్ధి సంస్థ తరపున రూ. 18.26 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటూ మూడు అంతస్తులలో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించారు. ఈ పోలీస్ స్టేషన్ భవనం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో ఉంటుంది. ఇన్‌స్పెక్టర్లకు గదులు, నేరస్తులను బంధించేందుకు సెల్, విశ్రాంతి గదులు, ప్రజా సంప్రదింపుల గది, వెయింటింగ్ హాల్, జిమ్, ద్విచక్ర, నాలుగు చక్రాల వాహన పార్కింగ్ వంటి వివిధ సౌకర్యాలతో నిర్మించారు. ఈ బస్ టెర్మినల్ నుంచి రోజుకు సుమారు 2,500 బస్సులు నడుపుతున్నారు. 50 వేల నుంచి సుమారు 2 లక్షల మందికి సేవలు పొందుతున్నారు. వీరి భద్రత కోసం ప్రత్యేకంగా ఓ పోలీసు స్టేషన్‌ను తీర్చిదిద్దారు. భద్రతను నిర్ధారించడానికి చెక్‌పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొళత్తూరు నుంచిసీఎం ప్రారంభించారు. అలాగే, పెరంబూర్‌లోని మార్కెట్ వీధిలో రూ. 9.74 కోట్లతో నిర్మించిన బాలికల మాధ్యమిక పాఠశాల అదనపు భవనాలను సీఎం ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
చైన్నె మహానగర అభివృద్ధి సంస్థ తరపున కొలత్తూరులో 11.37 కోట్లు గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటూ నాలుగు అంతస్తులతో 29,514 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. పెరవళ్లూరు పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ డివిజన్, సైబర్ క్రైమ్ డివిజన్ భవనం, రెట్టేరిలోని రూ. 1.62 కోట్లతో ఆధునిక మరుదు దొడ్లు, ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో బస్టాప్‌లు, కొళత్తూర్ శాసనసభ నియోజకవర్గం జోన్– 6, వార్డు 70లో రూ. 3.27 కోట్లతో కాలువకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, వార్డు 69లో రూ. 1.39 కోట్లతో క్రీడామైదానం, వార్డు 64, 65, 67, 69లో తొమ్మిది పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. మొత్తం రూ. 17.65 కోట్లతో 14 కొత్త ప్రాజెక్టుల పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపనను చేశారు. ముందుగా పెరంబూరు పాఠశాలలో విద్యార్థులతో సీఎంస్టాలిన్ ముచ్చటించారు. కొలత్తూరు శాసనసభ కార్యాలయంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకం, సహాయకాలను అందజేశారు. కొళత్తూరులోని ప్రైవేట్ జిమ్‌లో అగ్నిప్రమాదం కారణంగా వాహనాలను కొల్పోయిన ముగ్గురు బాధితులకు ద్విచక్ర వాహనాలను కొత్తగా సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ఎమ్మెల్యేలు తాయగం కవి, వెట్రి అళగన్, , జోసెఫ్ శామ్యూల్, డిప్యూటీ ఎం. మహేశ్‌కుమార్, డీజీపీ శంకర్ జివాల్, పట్టణాభివృద్ధి శాఖ అదనపుముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, తాంబరం మునిసిపల్ కమిషనర్ అబిన్ దినేష్ మెదక్, చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జేకుమర గురుబరన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తాంబరంలో రూ. 115.38 కోట్లతో 400 పడకలతో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని ఈనెల9వ తేదీన సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు ప్రకటించారు. ఇక్కడ పూర్తయిన పనులను ప్రజా పనుల శాఖ మంత్రి ఏవీ వేలు మంగళవారం పరిశీలించారు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోఅసిస్టెంట్ ఇంజినీర్లతో పాటూ పలు పోస్టుల భర్తీ నిమిత్తం 2,538 మందిని ఎంపిక చేశారు. వీరికి బుధవారం సీఎంస్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేయనున్నారు.
ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న
సీఎం స్టాలిన్
కొళత్తూరు ప్రగతికి..

● సీఎం స్టాలిన్ శంకుస్థాపన ● కిలాంబాక్కంలో పోలీస్ స్ట