
కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
వేలూరు: కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం ప్యాకెట్లును తమిళనాడుకు కారులో తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు.. పేర్నంబట్టు మీదుగా కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం ప్యాకెట్లు తరలిస్తున్నట్లు ఎకై ్సజ్ పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో గుడియాత్తం సమీపంలోని వి.కోట క్రాస్ రోడ్డు వద్ద ఎకై ్సజ్ పోలీసులు వాహణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఏసీ కారును అడ్డుకొని తనిఖీ చేయగా అందులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కారును నడుపుతున్న వేలూరు జిల్లా పేర్నంబట్టు ప్రాంతానికి చెందిన బయాస్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని కారులో ఉన్న 29 బాక్సుల్లో ఉన్న మొత్తం 1,800 కర్ణాటక మద్యం ఫ్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి కారుతో పాటు మద్యం ప్యాకెట్లును స్వాధీనం చేసుకొని పరారీ అయిన చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సంతోష్‌కుమార్ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు పేర్నంబట్టు ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.