
‘జైలర్–2’ డిసెంబర్‌కు పూర్తి
తమిళసినిమా: రజనీకాంత్ ఇది పేరు కాదు తమిళ సినిమా బ్రాండ్. 50 వసంతాల సినిమా అసాధారణ పయనం. నేటికీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. ఈయన తాజాగా కూలీ చిత్రాలు పూర్తి చేశారు. లోకేష్ కనకరాజు కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని తలుపు విచ్చేస్తున్న భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇందులో క్రేజీ నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ యువ సామ్రాట్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా పలువురు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కూలీ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. కాగా ఆగస్టు 15వ తేదీతో రజనీకాంత్ నటుడుగా 50వ ఏట అడుగుపెట్టబోతున్నారన్నది గమనార్హం. దీంతో కూలి చిత్రం ప్రత్యేకత సంతరించుకుంది. కాగా తాజాగా రజనీకాంత్ జైలర్–2 చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రజకాంత్ నటిస్తున్న 172వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రం షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో కొంత భాగాన్ని జరుపుకుని ప్రస్తుతం కేరళలో జరుపుకుంటుంది. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని గురువారం ఉదయం చైన్నెకి తిరిగి వచ్చిన రజనీకాంత్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ అద్భుతంగా వస్తోందని, దర్శకుడు నెల్సన్ చాలా బాగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ డిసెంబర్ పూర్తి అవుతుందని చెప్పారు. కాగా దీని తర్వాత రజనీకాంత్ నటించిన చిత్రం ఏమిటన్న ప్రశ్నకు ఆయన ఒక టాలీవుడ్ యువ దర్శకుడితో చిత్రం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
జైలర్ – 2 చిత్రంలో రజనీకాంత్