
చైన్నెలో 150 పాఠశాలల వాహనాల తనిఖీ
● డ్రైవర్లకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
కొరుక్కుపేట: రవాణా కమిషనర్ అండ్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ –చైన్నె (సౌత్) ఆదేశాల మేరకు చైన్నె సౌత్, సౌత్ ఈస్ట్ రీజనల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ పరిధిలోని పాఠశాలలకు చెందిన సుమారు 150 పాఠశాలలను జిల్లా విద్యా శాఖ బృందం తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో ఆరు వాహనాల్లో లోపాలను గుర్తి ంచారు. వాటిని సరిచేసి మళ్లీ తనిఖీలు చేప ట్టాలని పాఠశాల యాజమాన్యానికి సూచించా రు. అలాగే బస్సు డ్రైవర్లకు ప్రథమ చికిత్సలపై ఆచరణాత్మక ప్రదర్శనలను అందించారు. పాఠశాల వాహనాల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగితే వెంటనే మంటలను ఆర్పే ప్రక్రియపై అగ్నిమాపక శాఖ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
నేడు మీనాక్షి అమ్మవారి కల్యాణ మహోత్సవం
●మదురైలో బ్రహ్మాండ వేడుకకు ఏర్పాట్లు
సాక్షి, చైన్నె: మదురై మీనాక్షి అమ్మవారి బ్రహోత్సవ వైభవంలో ముఖ్య ఘట్టంగా గురువారం అమ్మవారి కల్యాణోత్సవం జరగనుంది. ఇందుకోసం బ్రహ్మాండ ఏర్పాట్లు చేశారు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో గత నెల 29వ తేదీ నుంచి చిత్తిరై ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోజూ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రోజూ మాడ వీధుల్లో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం అమ్మవారికి పట్టాభిషేకం జరిగింది. బుధవారం దిగ్విజయ సేవ అత్యంత వేడుకగా జరిగింది. గురువారం ఉదయం 8.35–8.50 గంటల మధ్య మీనాక్షి, సుందరేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం జరగనున్నది. ఇందు కోసం మదురైలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు జన సందోహం పెద్ద ఎత్తున మదురై వైపుగా పోటెత్తుతున్నారు. తదుపరి 9వ తేదీన రథోత్సవం, 10వ తేదీన తీర్థవారి కార్యక్రమాలు జరగనున్నాయి. మే 12వ తేదిన కళ్లలగర్ స్వామి వారి వైగై నదీ ప్రవేశ ఉత్సవం జరగనుంది.
10,11 తేదీల్లో టైమ్ ప్రతిభా పరీక్ష
సాక్షి, చైన్నె : క్యాట్ 2025–26 శిక్షణలో చేరాలకునే విద్యార్థుల కోసం స్కాలర్ షిప్, టాలెంట్ సెర్చ్ పరీక్షను నిర్వహించేందుకు టైమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్ణయించింది. బుధవారం ఈ పరీక్ష వివరాలను స్థానికంగా ప్రకటించారు. ఈనెల 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు , 11వ తేదిన ఉదయం 10గంటలకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు తమకు నచ్చిన ఒక స్లాట్‌ను ఎంపిక చేసుకుని పేర్లను తమ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్, లాజికల్, వెర్బల్ ఎబిలిటీపై బహుళైచ్చిక ప్రశ్నలను ఉంటాయని వివరించారు.పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుందని, విద్యార్థులు తమ పేర్లను టైమ్‌టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ లింక్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల పనులు వేగవంతం చేయండి
సాక్షి, చైన్నె: ఎన్నికల పనులు వేగవంతం చేయాలని పార్టీ వర్గాలను డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆదేశించారు. బుధవారం చైన్నెలో డీఎండీకే కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల పనులు వేగవంతం చేసే దిశగా ఇందులో చర్చించినిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ కోశాధికారి సుదీష్, యువజన నేత విజయ ప్రభాకరన్‌లు రాష్ట్రవ్యాప్తంగావిస్తృతంగా పర్యటించే విధంగా చర్యలు చేపట్టారు. బలోపేతం దిశగా కార్యక్రమాలు వేగవంతం చేస్తూనే, తమ సత్తాను చాటుకునే విధంగా సూచనలు చేశారు. పార్టీల పొత్తు విషయంగా ఎలాంటి వ్యాఖ్యలు ఎవ్వరు చేయవద్దు అని ఈ సమావేశంలో తీర్మానించారు. అన్నాడీఎంకే కూటమితో లోక్ సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
నూతన చేపల మార్కెట్ ప్రారంభం
చైన్నె చింతాద్రి పేటలో రూ.2.92 కోట్లతో అధునిక చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే బీసెంట్ రోడ్డులో రూ. 2.04 కోట్లతో నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కేంద్రం నెలకొల్పారు. వీటిని బుధవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు.
– సాక్షి, చైన్నె

చైన్నెలో 150 పాఠశాలల వాహనాల తనిఖీ