కొరుక్కుపేట: కారుణ్య వర్సిటీ ఆధ్వర్యంలో మైండ్‌క్రాఫ్ట్ 2025 పేరుతో వార్షిక టెక్ ఫెస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకను బ్రాడ్‌లైన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆర్ముగం ముర్కియా ప్రారంభించారు. చైన్నె కారుణ్య యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ప్రిన్‌న్స్ అరుల్‌రాజ్ మాట్లాడుతూ 100కి పైగా ఈవెంట్‌లు, రూ.10 లక్షల విలువైన బహుమతులతో ఈవెంట్ అద్భుతమైన పరిశోధన, టెక్‌టాక్‌లు, వర్క్‌షాప్‌లను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. ముందుగా ఆర్ముగం ముర్కియా విద్యార్థులు వారి ఆవిష్కరణలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రశంసించారు.