సాక్షి, చైన్నె: డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రిలో పిన్‌హోల్ పపిల్లోప్లాస్టీని కార్నియల్ స్క్లెరల్ రిపేర్, ఇంట్రాకోక్యులర్ కణజాలాల రీపోజిషనింగ్ వంటి బహుళ శస్త్రచికిత్సా విధానాలతో కలిపి ఒకే సిట్టింగ్‌లో విజయవంతం చేశారు. ఈ అధునాతన నేత్ర సంరక్షణలో పురోగతిని సాధించారు. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కుడి కంటిలో తీవ్ర గాయాల పాలైన ఒక సీనియర్ పౌరుడి దృష్టిన పునరుద్ధరించడానికి పిన్‌హోల్ పపిల్లోప్లాస్టీని కార్నియల్, స్క్లెరల్ రిపేర్‌తో కలిపి సంక్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ అగర్వాల్స్ ఆస్పత్రి ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్ వివరించారు. అత్యవసర జోక్యం కార్నియల్ మార్పిడి అవసరాన్ని ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా నివారించిందన్నారు.ఇన్ఫెక్షన్లు , గ్రాఫ్ట్ తిరస్కరణ ప్రమాదాలను గణనీయంగా తగ్గించిందన్నారు. సురక్షితమైన , మరింత ప్రభావవంతమైన దృష్టి పునర్దురణను నిర్దాంచామన్నారు.పీపీపీ బహుళ శస్త్రచికిత్సా విధానాలతో అనుసంధానించడంలో రోగికి ముందుగా ఉన్న కంటి శుక్లంను పరిష్కరించడానికి కంటిలోని కణజాల పునఃస్థాపన చేశామన్నారు. హాస్పిటల్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతదేశంలో 54శాతం కంటే ఎక్కువ కంటి సంబంధిత సమస్యలు, 32శాతం అంధత్వ కేసులు గాయం వల్ల సంభవిస్తున్నాయన్నారు. ఇవి తరచుగా కార్నియల్ మచ్చలు, అస్పష్టతలు ఆస్టిగ్మాటిజంకు దారితీస్తాయన్నారు. ఇలాంటి కేసులలో పీపీపీ విధానం శ్రేయస్కరం అని తాము చాటి చెప్పినట్టు ధీమా వ్యక్తంచేశారు. క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ ఎస్. సౌందరి మాట్లాడుతూ, కార్నియా దృష్టిని కేంద్రీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వివిధ కారణాల వల్ల ఇది దెబ్బతింటుందని పేర్కొంటూ, పీపీపీ విధానంతో ఒకే సిట్టింగ్‌తో బహుళ సమస్యలను పరిష్కరించేందుకు మార్గంగా మారిందన్నారు.