తమిళసినిమా: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎల్ 2 ఎంపురాన్. నటి మంజుమోహన్, పృథ్వీరాజ్, టోవినో థామస్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్‌న్స్ సంస్థ నిర్మించిన తొలి మలయాళ చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈచిత్రాన్ని ఈనెల 27న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన లూసీఫర్ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌నే ఎల్ 2 ఎంపురాన్. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నటుడు పృథ్వీరాజ్ ఇటీవల రజనీకాంత్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్ర ట్రైలర్‌ను రజనీకాంత్‌కు చూపించారు. ట్రైలర్ చూసిన రజనీకాంత్ చాలా బాగుంది అంటూ ప్రశంసించడంతో చిత్రం మంచి విజయాన్ని సాధించాలని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపిన పథ్వీరాజ్ రజనీకాంత్‌ను కలవడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. యూఏ సెన్సార్ సర్టిఫికెట్‌తో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.