తిరువళ్లూరు: ప్రత్యేక ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వేర్వేరు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడానికి కళాకారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి అవగాహన కల్పిస్తున్నారు. ఇందు కోసం ఆరుగురితో కూడిన కళాకారులను బృందంగా ఏ ర్పాటు చేశారు. ఈ బృందాల వాహనాన్ని కలెక్టర్ ప్ర తాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కళాకారులు వీఽధినాటకం,
గ్రీవెన్స్‌డేకు 672 వినతులు
సోమవారం ఉదయం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 672 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన ప్రజలు వేర్వేరు సమస్యలను పరిస్కరించాలని కోరుతూ కలెక్టర్ ప్రతాప్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఇళ్ల పట్టాల కోసం 187 వినతులు, సాంఘిక సంక్షేమ శాఖకు 153 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 83, ఉపాధి కల్పనకు 127 వినతులతో సహా మొత్తం 627 విన తులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. అనంతరం ఐదుగురు వికలాంగులకు రూ.5.9 లక్షల విలువ చేసే స్కూటర్లను అందజేశారు. డీఆ ర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ తిరువళ్లూరు జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ పాల్గొన్నారు.