ఘాటి అంచనాలను అందుకుంటుందా? | - | Sakshi
Sakshi News home page

ఘాటి అంచనాలను అందుకుంటుందా?

Mar 18 2025 12:43 AM | Updated on Mar 18 2025 12:42 AM

తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి అనుష్క. తెలుగులో తొలుత కథానాయకిగా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్‌గా రాణించారు. మొదట్లో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్‌ను నమ్ముకున్న అనుష్కను అరుంధతి చిత్రం ఆమె కెరీర్‌నే మార్చేసింది. ఆ చిత్రంలో అనుష్క రౌద్రమైన నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాల విజయాలకు తన నటన అదనపు బలంగా మారింది. బరువు పెరగడం తదితర అంశాల కారణంగా సినిమాలు తగ్గాయనే చెప్పాలి. అనుష్క చివరిగా నటించిన చిత్రం మిస్‌శెట్టి మీస్టర్‌ పొలిశెట్టి 2023లో విడుదలై మంచి విజయాన్నే అందుకుంది. కాగా ఆ తరువాత రెండేళ్ల గ్యాప్‌ తరువాత అనుష్క నటించిన ఘాటి చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీన్ని టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన వేదం చిత్రం 2010లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా 15 ఏళ్ల తరువాత ఇప్పుడు ఘాటి చిత్రంతో ఈ కాంబో రిపీట్‌ కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు విక్రమ్‌ ప్రభు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఘాటి చిత్రం తమిళంతో పాటూ మలయాళం,తెలుగు, కన్నడం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించారు. కాగా ఈ చిత్ర టైటిల్‌, టీజర్‌లు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. కాగా చిత్రాన్ని ఎప్రిల్‌ 18వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రకటించిన ప్రకారం ఘాటి చిత్రం తెరపైకి వస్తుందా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఈ చిత్రం అంచనాలను అధిగమిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈ 44 ఏళ్ల భామ తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కత్తనార్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఘాటి చిత్రంలో

నటి అనుష్క

ఘాటి అంచనాలను అందుకుంటుందా? 1
1/1

ఘాటి అంచనాలను అందుకుంటుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement