
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవంలో కలెక్టర్ కుమరవేల్ పాండియన్
వేలూరు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అన్నారు. గ్రామీణాభివృద్ధి పథకం కింద మానవ హక్కుల శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గం జమాల్‌పురంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని సీఎం స్టాలిన్ చైన్నె సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కలెక్టర్ నూతన భవనాన్ని ప్రారంభించి విద్యార్థుల వద్ద ఉదయం ఆహార పథకం వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల కోసం తయారు చేసిన వంటకాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. నాణ్యమైన విద్య, రుచి కరమైన ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో యూనియ న్ చైర్మన్ అముద, డీఈఓ మణి మొయి, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజినీర్ సెంథిల్, బీడీఓ విన్‌సెంట్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.