
ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ ర్యాలీ
తిరువళ్లూరు: ఉగ్రవాదులను తుదముట్టించిన భారత సైన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరువళ్లూరులో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరువళ్లూరులోని కామరాజర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ బజారువీధి, నేతాజీ రోడ్డు, మార్కెట్ వీధి మీదు సాగింది. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం సాగిన ఈ ర్యాలీలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా దిశ కమిటీ సభ్యుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ హాజరయ్యారు. ఉగ్రపోరులో భారత సైన్యం చేసిన పోరాటం ఫలితంగానే ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిందన్నారు. భవిషత్తులోనూ భారత సైన్యం ఉగ్రపోరులో ముందుంటుందన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజ్‌కుమార్, జిల్లా కార్యదర్శి పన్నీర్‌సెల్వం, మండల మాజీ అధ్యక్షుడు సతీష్‌కుమార్, పార్టీ నేత ములైజ్ఞానం తదితరులు పాల్గొన్నారు.