
కోదండరామునికి ‘కియోస్క్’ బహూకరణ
తిరుపతి కల్చరల్ : శ్రీకోదండరామస్వామి ఆలయానికి శుక్రవారం కియోస్క్ యంత్రాన్ని సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది. ఈ క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్‌లో రూ.లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఇప్పటికే సౌత్ ఇండియా బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మిషన్ అందించారు. కియోస్క్ మిషన్లను తిరుమల అన్నదానం, పద్మావతి గెస్ట్ హౌస్, సీఆర్‌ఓ ఆఫీస్, దేవుని కడప, శ్రీగోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటి మిట్ట ,శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడలో టీటీడీ వినియోగిస్తోంది. కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఏవీ నిరంజన్, ఆర్.వెంకటరావు, డి.అశోక్ వర్ధన్, ఆలయ డిప్యూటీ ఈఓ బి.నాగరత్న, ఐటీ డీజీఎం బి.వెంకటేశ్వర్లు ,ఏఈఓ బి.రవి, సూపరింటెండెంట్ డి.మునిశంకర్ పాల్గొన్నారు.