
ప్రారంభోత్సవంలో సంతాన గోపాలన్, కల్య రఘుకుమార్, సూరి శ్రీవిలాస్
కొరుక్కుపేట: త్యాగరాజస్వామి, పురంధర దాసు, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితార్ అందించిన సంకీర్తనలతో సాగిన అఖండం సంగీత విభావరి ఆధ్యంతం అలరించింది. ఔత్సాహిక సంగీత చిన్నారులను ప్రోత్సహించేలా శర్వాణి సంగీత సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అఖండం పేరుతో 12 గంటల పాటు సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం 18వ వార్షిక అఖండం సంగీత కచేరి నిర్వహించారు. స్థానిక మైలాపూర్‌లోని రాగసుధ హాలు వేదికై ంది. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీవిలాస్, ట్రస్టీ రఘుకుమార్, సంగీత కళానిధి నైవేలి ఆర్.సంతాన గోపాలన్, ప్రత్యేక అతిథి భారతీయ సంగీత వైభవం ట్రస్ట్ వ్యవస్థాపకులు సురేష్‌కుమార్ బొప్పరాజు పాల్గొని అఖండంను ప్రారంభించారు. అతిథులను ట్రస్టీలు సత్కరించారు.