కొరుక్కుపేట: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌న్ ఆదేశానుసారం వల్లలార్ 200వ వార్షికోత్సవం, ముగ్గుల వేడుకలు తండయార్‌పేట్‌లోని పిల్లయార్ కోయిల్ స్ట్రీట్‌లోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో హిందూ దేవదాయ శాఖ మంత్రి పి.కె. శేఖర్‌బాబు అధ్యక్షత వహించారు. చైన్నె ఉత్తర జిల్లా కార్యదర్శి, చైన్నె కార్పొరేషన్ 4వ జోనల్ కమిటీ చైర్మన్ నేతాజీ గణేశన్, హిందూ మత ధర్మాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ముల్లా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వల్లలార్ 200వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అన్నారు.