తిరువొత్తియూరు: వర్షపు నీటి కాలువలోకి మురుగునీటిని వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కారోపరేషన్ చైర్మన్ అన్నారు. చైన్నె మున్సిపల్ కార్పొరేషన్ తిరువొత్తియూర్ జోనల్ కమిటీ సమావేశం జోనల్ కమిటీ అధ్యక్షుడు డీఎం తనిఅరసు అధ్యక్షతన జరిగింది. జోనల్ అసిస్టెంట్ కమిషనర్ నవేంద్రన్ అధ్యక్షత వహించారు. సమావేశంలో 40 తీర్మానాలను ఆమోదించారు. కమిటీలో సభ్యుల ప్రశ్నలకు మండల కమిటీ చైర్మన్ తనియరసు సమాధానమిస్తూ తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేస్తే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నార్త్ చైన్నె డెవలప్‌మెంట్ ప్లాన్ కింద తీరప్రాంతంలో 3వేల వీధిలైట్లు ఏర్పాటు చేయడంతోపాటు జోన్ పరిధిలోని ప్రాంతాల్లో వర్షపు నీటి కాలువలోకి అక్రమంగా మురుగునీటి వదిలే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వర్షపు నీటి కాలువలోకి వ్యర్థ జలాలను విడుదల చేసే వారికి రూ.10వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.