
జకీర్ హుస్సేన్
సాక్షి, చైన్నె: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం ఆదివారం చైన్నెలో జరగనుంది. సమావేశానికి సోషల్ మీడియా సోదరులు, అభిమానులు తరలిరావాలని వైఎస్సార్‌సేవాదళ్ తమిళనాడు ఉపాధ్యక్షుడు జకీర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గానీయండి, ప్రత్యర్థులు చేసే విమర్శలకు ఎదురుదాడి చేయడంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియా కార్యక్రమాల విస్తృతం, సోషల్ మీడియా సైనికులకు ప్రాధాన్యత, గుర్తింపు కల్గించే విధంగా చైన్నెలో ఆత్మీయ సమావేశానికి నిర్ణయించారు. ఈ వివరాలను స్థానికంగా జకీర్ హుస్సేన్ వివరించారు. జూన్ 4వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం జరగనున్నట్టు తెలిపారు. చైన్నె ఓఎంఆర్ మార్గంలోని పార్క్ ప్లాజా వేదికగా జరగనున్న ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ మీడియా అండ్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్, వైఎస్సార్‌సీపీ కార్యదర్శి చల్లా మధుసూదన్ హాజరుకానున్నారు. సమావేశానికి సోషల్ మీడియా మిత్రులు, వైఎస్సార్‌సీపీ, సేవాదళ్ వర్గాలు, ఐటీ విభాగం వర్గాలు తరలిరావాలని పిలుపునిచ్చారు.