ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం

Jun 3 2023 1:36 AM | Updated on Jun 3 2023 1:36 AM

10,318 మందికి సీట్ల కేటాయింపు

తిరువొత్తియూరు: ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించారు. తమిళనాడులో 12వ తరగతి సాధారణ పరీక్ష ఫలితాలు గతనెల 8వ తేదీన విడుదలయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీల్లో ప్రవేశానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న 164 ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ కాలేజీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 1.07,299 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నారు. మే 8 నుంచి సుమారు 2,46,295 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని అనుసరించి, తమిళ భాషా విద్య కోసం తమిళ భాషలో చదివిన వారికి ప్రత్యేక ర్యాంకింగ్‌ జాబితాను ప్రచురించారు. స్కోర్‌కార్డ్‌లో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఇంగ్లీష్‌ సబ్జెక్టులో, ఇతర అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల కోసం ఇతర 4 సబ్జెక్టులలో పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రచురించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో చేరేందుకు స్పెషల్‌ కేటగిరీ విద్యార్థుల కౌన్సెలింగ్‌ 29న ప్రారంభమైంది. ప్రత్యేక వర్గాల వారి కోసం మొదటి రోజు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో వికలాంగులు, మాజీ సైనికుల వారసులు, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు. జూన్‌ 1 నుంచి 10వ తేదీ వరకు జనరల్‌ కేటగిరీకి, 2వ దశలో జూన్‌ 12 నుంచి 20 వరకు, మూడో దశ జూన్‌ 31న జరుగుతుంది. సీట్లు పొందిన వారికి జూన్‌ 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement