
నిందితుడు నందకుమార్
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం తిరునావ వీధికి చెందిన సత్యమూర్తి కుమారుడు నందకుమార్(22). ఇతను గుడియాత్తంలో సిమ్‌కార్డు ఏజెంట్. ఈ నేపథ్యంలో నందకుమార్ 2020లో తాత ఫొటోలను ఉపయోగించడంతో పాటు పలువురి ఆధార్ కార్డులను ఉపయోగించి వేర్వేరు వ్యక్తులకు సిమ్‌కార్డులను విక్రయించాడు. నందకుమార్ ఇతరుల ఆధార్ కార్డుల ద్వారా సిమ్ కార్డులు విక్రయిస్తునట్లు చైన్నె సైబర్ క్రైమ్ పోలీసులు వేలూరు ఎస్పీ కార్యాలయానికి నివేదిక పంపారు. దీంతో ఎస్పీ మణివన్నన్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ అపర్ణ ఆధ్వర్యంలో పోలీసులు గుడియాత్తం ప్రాంతంలో ఉన్న నందకుమార్‌ను అరెస్ట్ చేశారు.
గల్లంతైన యువకుడి
మృతదేహం లభ్యం
తిరువొత్తియూరు: కోవై జిల్లా వాల్పారైలోని ఓ జలపాతంలో జారిపడి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. కోవై జిల్లా వాల్పారై బిర్లా జలపాతంలో స్నానం చేస్తుండగా కోవైకి చెందిన సాగర్ (21) జారిపడి నీటిలో గల్లంతయ్యాడు. ఐదు రోజుల తర్వాత శుక్రవారం నీటిలో శవంగా తేలాడు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి శవపరీక్ష కోసం వాల్పారై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.