
హుస్సేన్, సెంథిల్
●మున్సిపల్ కమిషనర్,
హెల్త్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్
కొరుక్కుపేట: దోమల మందు కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పదవీ విరమణ చేయాల్సిన రోజే కమిషనర్ సెస్పెండ్ కావడం కలకలం రేపింది. ఈరోడ్ జిల్లా పుంజైపులియంబట్టి దుకాణంలో దోమల నివారణ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందాయి. దీంతో కంగుతిన్న మున్సిపల్ చైర్మన్ జనార్దన్ , డిప్యూటీ చైర్మన్ పీఏ చిదంబరం, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయంలోని రిజర్వు రూమ్‌లో సోదాలు చేశారు. రూ.4 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినట్టు స్టాక్ రిజిస్టర్‌లో పేర్కొన్న దోమల మందు స్టాక్‌రూంలో స్టాక్ కనిపించలేదు. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. తిరుచ్చి మల్టీ పర్పస్ ఇన్‌కో సర్వే సొసైటీ వారు దోమల నివారణ మందుల కొనుగోలుకు డైకాజోల్‌ను అందించారని, కొనుగోలు చేసిన దోమల నివారణమందులు ఎక్కడ ఉన్నాయని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఈలోగా దోమల మందు కొనుగోలులో అవకతవకలు జరిగాయని నగరపాలక సంస్థ తెలిపింది. నగర పాలక సంస్థ తరఫున ఎండీ, రీజినల్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హుస్సేన్, సెంథిల్‌లను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.