అన్నానగర్: ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. చైన్నె పెరుంగుడి నుంచి ఈసీఆర్ మీదుగా గురువారం వేకువజామున ఇద్దరు ద్విచక్రవాహనంలో పుదుచ్చేరి వైపు వెళుతున్నారు. ఆ సమయంలో పుదుచ్చేరి నుంచి చైన్నె వైపు మరో ద్విచక్రవాహనంలో ఓ వ్యక్తి వస్తున్నాడు. గురువారం ఉదయం 7 గంటలకు కల్పాక్కం సమీపంలోని పెరుందురావు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయపడ్డారు. మహ్మద్ ఇబ్రహీం, మరొకరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైకు నడుపుతూ వచ్చిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండగా చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు తెలియరాలేదు.