భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తప్పులు దొర్లాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో వద్ద ఆయన పేరును జిల్లా విద్యాశాఖ అధికారిగా, రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో వద్ద కలెక్టర్ పేరును ప్రచురించారు. ఈ ఫ్లెక్సీని చూసిన అధికారులు, తిలకించేందుకు వచ్చిన వివిధ రంగాలకు చెందిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యాశాఖ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.


