సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనంగా నెలకు రూ.18 వేలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎన్.కవిత, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్‌లో చేపట్టిన రాస్తారోకోలో వారు మాట్లాడారుఉ. ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అన్యాయంగా తొలగించిన ఆశా వర్కర్ల వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా నాయకురాలు రాధా భాగ్యలక్ష్మి, విజయ్ కుమారి, సైదమ్మ, ఉమా, హుస్సేనీ, సోమక్క, జ్యోతి, సుధా, సరస్వతి, అరుణ, సీత, జయమ్మ, సక్కుబాయి, బైనాబాయి, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, గౌరవ సలహాదారులు శ్యామల అశోక్ పాల్గొన్నారు.


