ఎన్నికల సిబ్బంది అలసత్వం వహించొద్దు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల విధుల్లో సిబ్బంది అలసత్వం వహించవద్దని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు హుసేన్, అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీ లించి మాట్లాడారు. ఈ సందర్భంగా అధికా రులతో మాట్లాడి సామగ్రి పంపిణీ వివరా లను తెలుసుకున్నారు. వారి వెంట డీఎస్పీ నర్సింహాచారి, తహసీల్దార్ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామచందర్‌రావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు, తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల వ్యయ పరిశీలకులు బడేసాబ్, ఆనంద్, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
శివరాత్రి జాతరకు మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానం
హుజూర్‌నగర్ : మేళ్లచెరువు శివాలయ ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఓవర్ లోడ్
సమస్యను పరిష్కరించండి
సూర్యాపేట అర్బన్ : విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యలు పరిష్కరించాలని కమర్షియల్ చీఫ్ ఇంజనీర్ రవికుమార్ అన్నారు. జిల్లా సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విద్యుత్ అధికారులతో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్తగా ప్రతిపాదించిన సబ్ స్టేషన్ల పనుల పురోగతి, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పురోగతిపై సమీక్షించారు. అనంతరం జిల్లా స్టోర్స్‌ను పరిశీలించి స్టోర్స్‌లో అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, డీఈ టెక్నికల్ సీహెచ్ విద్యాసాగర్, డీఈలు వెంకటకృష్ణయ్య, జ్యోతికుమార్, స్వామి, స్టోర్స్ ఏడీఈ సత్యనా రాయణ కమర్షియల్ ఏఓ అశోక్ పాల్గొన్నారు.
పిల్లలమర్రి శివాలయంలో సంప్రోక్షణ
సూర్యాపేట : పిల్లలమర్రి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయానికి రిటైర్డ్ ఏఎస్పీ గంగాధర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫైర్ డిపార్ట్‌మెంట్ సహకారంతో మంగళవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఏఎస్పీ గంగాధర సత్యనారాయణ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి ఏకేశ్వరాలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ వెంకన్న డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సిబ్బంది అలసత్వం వహించొద్దు
ఎన్నికల సిబ్బంది అలసత్వం వహించొద్దు
ఎన్నికల సిబ్బంది అలసత్వం వహించొద్దు


