సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

సిబ్బ

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేటటౌన్‌ : మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్‌ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతిఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, అనుమతిలేని వ్యక్తులను ఓటరు కానీ వారిని పరిసరాల్లోకి రానివ్వొద్దన్నారు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్‌ ఫోన్‌న్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్‌ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్‌ (ఎంసీసీ) నియమాలను పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, సూర్యాపేట డివిజన్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్‌, రామారావు, శివకుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి1
1/1

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement