రాజేష్‌ మృతికి కారకులను శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

రాజేష్‌ మృతికి కారకులను శిక్షించాలి

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

రాజేష్‌ మృతికి కారకులను శిక్షించాలి

రాజేష్‌ మృతికి కారకులను శిక్షించాలి

పెన్‌పహాడ్‌ : కర్ల రాజేష్‌ మృతికి కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. మంగళవారం పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజేష్‌ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయని రాజేష్‌ను చిలుకూరు ఎస్‌ఐ సురేష్‌రెడ్డి అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసుల దెబ్బలను తట్టుకోలేక రాజేష్‌ మృతి చెందాడని ఆరోపించారు. రాజేశ్‌ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతోపాటు బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేసి శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తప్పుచేసిన పోలీసు అధికారులను ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు కొండేటి గోపి, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజయ్య, శివకుమార్‌, నరసింహ, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి యుగేంధర్‌, దాసరి శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఒగ్గు కిరణ్‌, నన్నెపంగ సైదులు, లింగయ్య, కృష్ణ, శ్రావణ్‌కుమార్‌, మహేందర్‌, శ్యాంసన్‌, గోపి పాల్గొన్నారు.

ఫ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement