ఉపాధి పనులు పూర్తి చేయండి
భానుపురి (సూర్యాపేట) : ఉపాధిహామీ పనుల్లో వేగం పెంచి గడువులోపు లక్ష్యం చేరాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏపీడీలు, ఈసీలతో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. జల్ శక్తి, జన్ భాగిదారి కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీని గుర్తించి, నీటి సంరక్షణకు సంబంధించిన 20 రకాల పనులను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత పెంపొందించడం, భూగ ర్భ జల మట్టాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పనులు ఉండాలన్నారు. మహిళా శక్తి ఉపాధి భరోసా కింద ఆరు రకాల పనులు గుర్తించాలని, వనమహోత్సవం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ, ఏపీడీ శిరీష, తుంగతుర్తి ఎంపీడీఓ శేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూరు శాతం ఫలితాలు సాధించాలి
పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి పాఠశాల నూరు శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, కే జీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, టీజీఎంఎస్ ప్రిన్సి పాళ్లతో వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 70 శాతం మా ర్కులు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. పెండింగ్ భవిత సివిల్ వర్క్స్‌ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రావణ్, కో ఆర్డినేటర్లు పూలమ్మ, రాంబాబు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


