ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
నేరేడుచర్ల : మున్సిపల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో, సజావుగా జరిగేలా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం ఆయన నేరేడుచర్ల పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరి శీలించారు. పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలు, వాటి పరిసరాలను క్షేత్రస్థాయిలో పరి శీలించాలన్నారు. మద్యం, నగదు అక్రమ రవాణా, ఆసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. పట్టణాల్లోకి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలేని స్పష్టం చేశారు. ఎన్నికల నియమనిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై కఠిన వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచే ఎఫ్‌ఐఆర్ చేసే కార్యక్రమాన్ని ముందుకెళ్లాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ రవీందర్‌నాయక్, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


