కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు

Feb 5 2026 7:11 AM | Updated on Feb 5 2026 7:11 AM

కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు

కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు

కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పెద్ద మనుషులు, ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడి కాంగ్రెస్‌ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం సాగర్‌ ఆయకట్టు కింద ఉందని, 90శాతం రైతులు ఇక్కడ వరి పండిస్తారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ హయాంలో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 12లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నెల్లికల్లు, వీర్లపాలెం, దున్నపోతులగండి, తోపుచర్ల, కేశవాపురం లిఫ్టులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కృష్ణా బేసిన్‌ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకుని రైతులకు అందిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement