సమ్మర్.. సాఫీగా పవర్
నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ పంపిణీకి ప్రణాళిక
వేసవి కార్యాచరణలో భాగంగా జిల్లాలో నూతనంగా పది 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. మూడు చోట్ల పనులు పూర్తి కాగా, నాలుగు చోట్ల పురోగతిలో ఉన్నాయి. మార్చి నాటికి అన్నీ అందుబాటులోకి తెస్తాం. నిరంతరం నాణ్యమైన, అంతరాయం లేని కరెంట్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
– శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ
సూర్యాపేట అర్బన్ : జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) వేసవికి ముందే ఏర్పాట్లు చేస్తోంది. మార్చి నాటికి పది సబ్‌స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. బక్కమంతులగూడెం, బాలాజీనగర్, ముకుందాపురంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తి కాగా, మిగతా చోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులన్నీ పూర్తి చేస్తామని ఆ శాఖ అధికారులు అంటున్నారు.
జిల్లాలో ప్రస్తుతం సబ్‌స్టేషన్లు
జిల్లాలో ప్రస్తుతం 79 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 65, 132/32, 220/ 132 కేవీ సబ్‌స్టేషన్లు 10 ఉండగా, కూసుమంచి, నల్ల గొండ, వరంగల్ నుంచి మూడు ఫీడర్లు కలుస్తున్నాయి. చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపహాడ్‌లో 400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ ఒకటి ఉంది. విద్యుత్ కనెక్షన్లు డొమెస్టిక్ 3,33,849, వ్యవసాయం 1,52,603, పరిశ్రమలకు సంబంధించి 40,072 కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 10,05 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. వేస విలో 5నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. లోడ్ పెరిగినా వినియోగదారులకు అంతరాయం లేని కరెంట్ సరఫరా చేయడమే లక్ష్యంగా పది 33/11 కేవీ సబ్‌స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.26.68 కోట్లు మంజూరు చేసింది.
పాత లైన్లపై భారం పడకుండా..
అదనంగా పది 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్) సామర్థ్యం పెంచనున్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్) కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పాత లైన్లపై భారం పడకుండా కొత్తగా ఇంటర్ లింకింగ్ లైన్లు వేస్తున్నారు.
అదనంగా పది 33/11 కేవీ సబ్‌స్టేషన్లు,
ఇంటర్ లింకింగ్ లైన్లు
పీటీఆర్‌ల సామర్థ్యం పెంపు
రూ.26.68 కోట్లతో పనులు
మార్చి నాటికి పూర్తి
వేసవి వచ్చిందంటే విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతుంది.
గృహ అవసరాలతో పాటు పంటలకు
అధికంగా వినియోగం పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా డిస్కమ్
ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. డిమాండ్, సరఫరాకు గ్యాప్ లేకుండా నూతన
సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో పాటు
ఇంటర్‌లింకింగ్ పనులు చేపట్టింది.
విద్యుత్ కనెక్షన్లు
గృహ 3,33,849
వ్యవసాయం 1,52,603
పరిశ్రమలు 40,072
సమ్మర్.. సాఫీగా పవర్


