ఉత్తమ్ ఇలాఖాలో పోలీసు రాజ్యం
కోదాడ: కోదాడ నియోజకవర్గంలో పోలీసు రాజ్యం నడుస్తుందని, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ఖాకీ చొక్కాలు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులుగా పెట్టుకొని అకారణంగా దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతి ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఛలో కోదాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రాజేష్ మరణానికి కారణమైన పోలీసులు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో మంత్రి, ఎమ్మెల్యే వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ దీనిపై ఇంత వరకు నోరు విప్పలేదని, దీనికి కారణమైన అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డిని మంత్రి తన శాఖలో నియమించుకోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కోదాడలో మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే పెత్తనం చేస్తున్నాడని పేర్కొన్నారు. పోలీ సులు బీఆర్‌ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్ర తినిధి పైడి రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అవినీతి మయంగా మారిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజేష్ తల్లి లలితమ్మ, మాజీ ఎంపీపీ చింతా కవిత, కోదాడ పట్టణ బీఆర్‌ఎస్ అద్యక్షుడు ఎస్.కె. నయీం, పి.సత్యబాబు, సుంకర అజయ్‌కుమార్, తుమ్మలపల్లి భాస్కర్, కర్ల సుంధర్‌బాబు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ కోదాడ మాజీ ఎమ్మెల్యే
బొల్లం మల్లయ్య యాదవ్
స్తంభించిన కోదాడ పట్టణం
ఛలో కోదాడ పిలుపునకు వివిధ మండలాల నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కోదాడలో పోలీస్ యాక్ట్–30 అమల్లో ఉందని సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆంక్షలు విధించినా పట్టించుకోకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచే నాయకులు, కార్యకర్తలు భారీగా మల్లయ్య యాదవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా జాతీయ రహదారి మీదుగా బస్టాండ్ సెంటర్‌కు మల్లయ్యయాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి వచ్చారు. అనంతరం బస్టాండ్ సెంటర్‌లో మల్లయ్య మాట్లాడారు. రాజేష్ తల్లి లలితమ్మను వేదిక మీదకు పిలిచి ఆమెతో మాట్లాడించారు. మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలను టార్గెట్‌గా చేసుకొని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు కార్యక్రమం జరగడంతో ట్రాపిక్ స్తంభించింది.
ఉత్తమ్ ఇలాఖాలో పోలీసు రాజ్యం
ఉత్తమ్ ఇలాఖాలో పోలీసు రాజ్యం


