ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు కీలకం
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు, ఏఆర్వోల పాత్ర కీలకమని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమించిన ఆర్వోలు, ఏఆర్‌ఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ లో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం హ్యాండ్‌బుక్ ఆధారంగా తప్పులకు తావివ్వకుండా పక్కాగా విధులు నిర్వహించాలని సూచించారు. నోటిఫికేషన్ విడుదల మొదులుకొని ఫలితాలు వెల్లడించే వరకు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు, ట్రైనర్లు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ పనుల్లో వేగం పెంచండి
ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. భవిత కేంద్రాలు, కేజీబీవీలను ఫిబ్రవరిలో పూర్తి చేయాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హుజూర్‌నగర్‌లో ఐటీఐ కళా శాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


