ఫిట్‌గా ఉన్నప్పుడే మెరుగైన సేవలు
సూర్యాపేటటౌన్ : పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీ సులు వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తుంటారని పేర్కొన్నారు. రోజూ కనీసం అరగంట అయినా వ్యాయామం చేయాలని సూచించారు. పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ చేస్తున్న కృషిని కలెక్టర్ ప్రశంసించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం : ఎస్పీ
పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. పోలీసులు విధులు నిర్వహిస్తూనే వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. వైద్యశిబిరం ఏర్పాటుకు సహకరించిన సూర్యాపేటకు చెందిన హెల్తీఫై హాస్పిటల్, సూర్యాపేట జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపా రు. 600 మందికి పరీక్షలు నిర్వ హించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, జిల్లా ఆస్పత్రి డాక్టర్ గీతాలక్ష్మి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహచారి, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ
ఫిట్‌గా ఉన్నప్పుడే మెరుగైన సేవలు


