ఆడపిల్లలంతా చదువుకోవాలి
ఆత్మకూర్ (ఎస్) : ఆడపిల్లలంతా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండాలని ఎంవీ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ భాస్కర్ అన్నారు. శనివారం ఆత్మకూర్ (ఎస్)మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల భవనంలో నిర్వహించిన కిశోర బాలికల జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆడపిల్లలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువును ఆపకూడదన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల వివక్ష నిర్మూలన, వారి సర్వతోముఖాభివృద్ధికి ఎంవీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భరోసా ఇంచార్జి జ్యోతి, శ్రీజ, భావన, వైష్ణవి, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య స్టేట్ కమిటీ ఎంవీఫ్ ఇంచార్జి వత్సవాయి లలిత, సైదులు, జయలలిత, మంజుల పాల్గొన్నారు.


