మొదటి విడత ప్రశాంతం
అర్వపల్లి : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని అడివెంల, రామన్నగూడెం పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎస్‌ఐ ఈట సైదులు పాల్గొన్నారు.
నాగారం : మండలంలోని నాగారం, శాంతినగర్, పస్తాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో నిషేధిత ఆజ్ఞలు అమలు చేయాలని, కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని తెలిపారు.


