విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ప్రతిభా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. మన హక్కులతో పాటు విధులను కూడా సక్రమంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం ద్వారా శిక్ష విధిస్తారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సత్యంబాబు పాల్గొన్నారు.


