నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు
మండలాల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు
24 పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌కు వేళయ్యింది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఏకగ్రీవాలతో పాటు నామినేషన్‌దాఖలు కానివి పోగా మిగిలిన 152 గ్రామపంచాయతీలు, 1,241 వార్డులకు గురువారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4నుంచి 5గంటల వరకు బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి తరలింపు ప్రక్రియ బుధవారం రాత్రే పూర్తయ్యింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,31,851 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఎనిమిది మండలాల్లో..
జిల్లాలో మొత్తం 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డుల ఎన్నికలకు గత నెల 27న నోటిఫికేషన్ జారీఅయ్యింది. అయితే సర్పంచ్‌లకు 1,387, వార్డులకు 3,791 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 7 సర్పంచులు, 198 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3 వార్డులకు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. ఈ క్రమంలో మొదటి విడత 152 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 471 మంది బరిలో ఉన్నారు. 1,241 వార్డులకు పోలింగ్ జరగనుండగా 2,736 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
4,356మంది సిబ్బందితో..
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది నియామకం నుంచి బ్యాలెట్ పత్రాల వరకు అన్నింటినీ సమకూర్చుకున్నారు. 58 రూట్లను ఏర్పాటు చేసి బుధవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రిని 133 పెద్దవాహనాలు, మరో 59 చిన్న వాహనాల్లో ఆయా మండలాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి గ్రామాలకు తరలించారు. గురువారం 232 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1,403 పోలింగ్ కేంద్రాల్లో 2,31,851 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జోనల్ అధికారులు 28 మంది, 1,683 మంది పీఓ (ప్రొసైడింగ్ అధికారి), 2,260 మంది ఓపీఓలు, స్టేజ్–1 ఆర్‌ఓలు 104, 178 మంది స్టేజ్ –2 అధికారులు, 65 మంది రూట్ ఆఫీసర్లు, 38 మంది మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధుల్లో చేరారు. మరో ఎనిమిది మంది వ్యయ పరిశీలకులు ఉన్నారు. వీరితో పాటు అదనంగా 16ఎఫ్‌ఎస్‌టీ బృందాలు ఎన్నిల విధుల్లో ఉంటాయి. ఇప్పటికే తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్న వీరంతా తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు అనుగుణంగా 1,543 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకున్నారు. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ జరగనుంది.
2,31,851 మంది ఓటర్లు..
మొదటి విడతలో మొత్తం 2,31,851 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,16,705 మంది, పురుషులు 1,15,141 మంది, ఇతరులు మరో ఐదుగురు నమోదై ఉన్నారు. అత్యధికంగా ఆత్మకూర్ (ఎస్)లో 44,053 మంది ఓటర్లు, తుంగతుర్తిలో 34,616 మంది ఓటర్లు ఉన్నారు. జాజిరెడ్డిగూడెం 24,615, మద్దిరాల 25,307 మంది, నాగారం 24,775 మంది, నూతనకల్ 29,066 మంది, సూర్యాపేట 31,620 మంది, తిరుమలగిరి 17,799 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. వీరికి బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి పోల్‌చిట్టీలు పంపిణీ చేశారు. ఈ పోల్ చిట్టీలతో పాటు ఏదైనా గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లి ఓటువేయాల్సి ఉంటుంది. ఓటింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి 154 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫలితాలు వెల్లడించి.. ఉపసర్పంచ్ ఎన్నిక చేపట్టనున్నారు.
మండలాలు 08
పోలింగ్ సిబ్బంది : 4,356
రూట్లు : 58
బ్యాలెట్ బాక్సులు : 1,543
కౌంటింగ్ కేంద్రాలు : 154
మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లో 264 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాలను బిగించారు. అవే కాకుండా 24 సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
ఫ ఉదయం 7గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
ఫ 4గంటల వరకు తేలనున్న
అభ్యర్థుల భవితవ్యం
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్న 2,31,851 మంది ఓటర్లు
నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు
నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు
నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు
నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు
నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు


