పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలి
● కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
మద్దిరాల : ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని చిన్ననెమిల, మామిండ్లమడవ, జి.కొత్తపల్లి, కుంటపల్లి, కుక్కడం, గుమ్మడవెల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. ఈనెల 10వతేదీన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆయేషా పర్వీన్, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ ఎం.వీరన్న, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
తుంగతుర్తి : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కోరారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు ఆయనతోపాటు తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమారు ఉన్నారు.


