బృందావనపురం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం
నడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామ జనాభా 2,200 మంది ఉన్నారు. ఓటర్లు మొత్తం 1,501 మంది ఉన్నారు. వార్డులు 10 ఉన్నాయి. ఈ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. రెండో విడత ఈనెల 14న ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు ఏకతాటిపైకి వచ్చి చర్చలు జరిపి సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన విద్యావంతురాలు కంభంపాటి సరితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్‌గా మూడవ వార్డు సభ్యురాలు పుట్ట సైదమ్మను అధికారుల సమక్షంలో ఎన్నుకున్నారు. మొత్తం ఈ గ్రామంలో 10వార్డుల్లో సీపీఎం బలపర్చిన ముగ్గురిని, బీఆర్‌ఎస్ మద్దతురాలు ఇద్దరు, టీడీపీ బలపర్చిన ఇద్దరిని, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వార్డు సభ్యులుగా ఎన్నికై న వారిలో గోలి వెంకటేశ్వర్లు, కంభంపాటి నాగేశ్వరావు, పుట్ట సైదమ్మ , పుట్ట ఆంజనేయులు, కాసాని వీరమ్మ, కాసాని కిషోర్, నారా ఇందు, మాధ వీరబాబు, నోసిన త్రివేణి , మాధవరావు ఉన్నారు.
సర్పంచ్‌గా కంభంపాటి సరిత ఎన్నిక


