విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి
సూర్యాపేట అర్బన్ : 2025–విత్తన, విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) జిల్లా కన్వీనర్లు మండారి డేవిడ్ కుమార్, వరికుప్పల వెంకన్న, మట్టిపల్లి సైదులు, దంతాల రాంబాబు డిమాండ్ చేశారు. ఎస్‌కేఎం జాతీయ కమిటీ పిలుపుమేరకు సోమవారం సూర్యాపేటలో 2025–విత్తన, విద్యుత్ బిల్లుల పత్రాలను దహనం చేసి నిర్వసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రమవుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ఈ బిల్లులను తీసుకువస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కేఎం జిల్లా నాయకులు షేక్ నజీర్, కునుకుంట్ల సైదులు, పెరుమాళ్ల రాజారావు, నారబోయిన వెంకట్ యాదవ్, పుల్లూరి సింహాద్రి, ప్రవీణ్, చారి, ఇందిరా, ప్రమీల పాల్గొన్నారు.


