కేసులతో ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్
హుజూర్‌నగర్ : బీఆర్‌ఎస్ శ్రేణులను బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. సోమవారం హుజూర్‌నగర్ వచ్చిన ఆయన సీఐ చరమంద రాజుతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులను బైండోవర్ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా చట్టపరంగా వ్యవహరించాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని తాము కూడా 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా ఎవరినీ వ్యక్తిగతంగా వాడుకోలేదని ఆయన తెలిపారు. ప్రజా క్షేత్రంలో ఎవరికి నచ్చినట్లు వారు పోటీ చేస్తారని, ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వారు గెలుస్తారని చెప్పారు. అంతేకానీ భయపెట్టి ఇబ్బందులకు గురిచేసే స్వభావం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉండటంతో బీఆర్‌ఎస్ పార్టీవారిని భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులకు ఏ ఇబ్బందులు ఎదురైనా పార్టీ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు వై.వి.ఆర్, కేఎల్‌ఎన్‌రెడ్డి, అప్పిరెడ్డి, జక్కుల నాగేశ్వరావు, సైదిరెడ్డి, అమర్, ఉపేందర్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల


